14, ఏప్రిల్ 2012, శనివారం

An interview With INFINITY


THIS IS AN INTERVIEW WITH   "INFINITY"

                                                      MUSED BY :mpsmkbh@




ఇదొక చిలిపి సాహసం .కచ్చితమైన అల్లరి .కాదామరి?!
శాస్త్రీయ సిద్ధ్దాంతాలలో ఒక సామాన్య (కామన్ )తత్వం కనపడుతూ ఉంటుంది .ఒకానొక విషయంలో  అంత వరకూ ఉన్న లేక నిలదొక్కుకున్న విషయాలను ఆధారం చేసుకొని ,కొత్తవో లేక కొద్దిగా విచిత్రమైనవో  కనిపెట్టుకుంటూ వస్తూ వుంటారు .
దేనికీ లేని అనంత తత్వం సంఖ్యలకు ఉందని తెలిసి తెలిసి, ఎవ్వరూ నిరూపించ మనరు.ఈ చిన్న ప్రయత్నాన్ని  సహృదయంతో ఆలోచిస్తూ ,ఊహిస్తూ స్వీకరించాలని మనవి. చిన్నపిల్లలు వారి గురువుల సూచనలతో - దీనిని చిన్న సైజు నాటిక గా ప్రదర్సించవచ్చు




  







                                                  @@@
చిమ్మ చీకటిలో తళుక్కుమని మెరిసిన మెరుపుని ఫోటోలోకో, యూ ట్యూబ్  లోకో లాగేసి నట్టు :మొన్నా మధ్యన అనంతం గారితో ఓ చిన్న సైజు ఇంటర్వ్యూ లభించింది .సూటిగా వివరాల్లోకి వెళ్ళిపోదాం .ఒకే !
పలకరింపులూ మర్యాదలూ  అయ్యాక : 
"మరి మీరు సంఖ్యేనా?"
"నీకెందు కొచ్చిందీ  ఆ సందేహం!-సరే నాకు ముందున్నవన్నీ సంఖ్యలే అయితే నేనూ సంఖ్యనే అన్నాననుకో ..."
"మీక్కూడా వాటి లక్షణాలు ,గుణాలూ ప్రతి క్షేపించవచ్చు, ఊహించవచ్చు గదా అనీ...ఆశ .దానితో మీ దివ్య దర్శనభాగ్యం లభిస్తుందనీ మా  తరతరాల గణిత విద్యార్ధుల ,శాస్త్రజ్ఞ్యుల చిరకాల వాంఛ ."
"సంతోషం ,ఆ అనుమతిని ఇచ్చాననుకో ...నాకున్న ముఖ్య అనంత తత్వం ,శాశ్వత తత్వం  లాంటివి పలు సందేహాలకు దారి తీస్తాయ్ .నీ ప్రతిక్షేపణలు  ఆక్షేపణలకు గురై పోతాయి మరి తట్టుకో గలవా ?!"



















"గణితశాస్త్ర ప్రతిక్షేపణలు  లేకుండా ఏ ప్రకృతిక మరియూ సాంఘిక శాస్త్రం ఎదిగిందీ ,బట్ట కట్టిందీ -చెప్పండీ !?"
"సరే -నాకు ఇతర సంఖ్యల లక్షణాలు ఆపాదించి  చూడు :ఆ పైన నీ ఇష్టం :మురిసిపోతావో ,ఆశ్చర్యపోతావో ,నిన్ను నువ్వే చీవాట్లు పెట్టుకుంటావో ,మొదలెట్టూ,ఊ ..."
"మీరేమీ అనుకోకూడదు మరి ,ఓకే నా !"
"ఓకే! కానీయ్ మరి .అందరూ చూస్తున్నారు :నాకు ఏ లక్షణాలు అంటగడతావో  అని."
"ఆలోచెనలు తెగట్లా,ముందు మీ రూపం ఊహిస్తా -మీరు బేసి (ఆడ్) సంఖ్యలకు  చెందిన వారు కదూ !?"
"అవునో ,కాదో  గానీ -అలా ఎల్లా  ఊహించావూ?!"
"మరీ-ఒక స్థానం సంఖ్యలలో పెద్దది 9 ,రెండు స్థానాల సంఖ్యలలో  పెద్దది 99 ,అలాగే   999,9999,...................
మిమ్మల్ని ఊహించి రాస్తే ,మీ వంటి  నిండా అంతు లేకుండా తోమ్మిదులే కదా ,అప్పుడు మీ ఒకట్ల స్థానం లో ఉన్న 9 -మీరు ఒక సహజ బేసి సంఖ్య గా నిరూపిస్తోంది గదా . 9999......999......99999.ఇల్లా ఉండచ్చు మీ ..."
"దీనిని బట్టీ  ఇంకేమి ఊహించావూ?!"















"మీరు 3 లో  9 లో  నిశ్సేషంగా భాగించబడతారని ..."
"నిస్సందేహంగా ! అందుకే అనంత కాలాన్ని 3 రకాలుగా ఊహించారు."
"మీకు మిమ్మల్ని కూడినా లేక 2 తో  మిమ్మల్ని  గుణించినా  సరి  సంఖ్య  ఫలితమనీ ...."
"అంతేగదా !"
"మీలోంచి  1 తీసేసినా సరి సంఖ్యే వస్తుందనీ ..."
"ఊ ,కానీయ్ ...నాలోంచి నన్ను తీసేస్తే  ఫలితం సున్నా అనీ  సూన్యం అనీ ..."
"మాబాగా సెలవిచ్చారు .మిమ్మల్ని మీతోటే భాగిస్తే -'ఏకమేవా అద్వితీయం'-ఒక్కటే  జవాబనీ ..."
"నా పవర్ ఆఫ్ జీరో  కూడా ఒక్కటే ననీ -సరేనా ,మరీ ఇంతకీ నాకు ఒకటి కలిపితే వచ్చే సరి సంఖ్య మాట పక్కన పెట్టు, తర్వాతి స్థానాల సంఖ్యలలో నేనే అతి చిన్న దానిని అయ్యే ప్రమాదం వచ్చింది కదా ; మరి నా అతి పెద్దరికం  సంగతి ఏంటంటావ్ ?"
"అవునండోయ్ ,తీసేద్దాం కానీ కలపద్దు లెండీ !అవునూ, ఇది మీ ఇంటర్వ్యూ ,నాచేతేదో  చెప్పించు కోవటం కాదు గానీ , మీరే  మీ గురించి చెప్పండీ ."
"వింటావా  సరే :అనంతం గా ,శాస్వితంగా ఉన్నది ఒక్కటే ; అదీ ఈ భౌతిక సృష్టి లో ఒక్క సూన్యం మాత్రమే !
అదే నా విశ్వరూపం .నా గురించి మీ పూర్వ గణితానుభవం తో ఊహించినదీ ,అనుకుం టున్నదీ: అక్షర ,శబ్ద ఆకారాలతో  ఒట్టి గాలి కోట,నీటి మూట ,కలలో అద్దం లో ప్రతిబింబం : అర్ధం అవుతోందా!?"















"..........."
"ఒక పక్క నా గురించి అహర్నిశలూ పరిశోధించిన , పరిశోధి స్తూన్న,పరిశోధించబోయే  గణిత విద్యార్ధులూ,శాస్త్ర -జ్ఞ్యులు  0/0 = ?  ఒక్కటా ,సూన్యమా లేక నేనా (అనంతమా) అని కలవరిస్తూన్నారు ."
"........"
"మానవావిష్కరణ లలో గణితం అనంతం,శాస్వితం ,అమూల్యం అయినది .నన్ను నాపాటికి వదిలిపెట్టారు,గనకే గణితం యొక్క అగణితసాధన తో , సాయం తో మిగితా భౌతిక ,రసాయనిక , సాంకేతిక ,జీవ,సాంఘిక,వాణిజ్య శాస్త్రాలూ ...వాటి శాఖలూ,ఉప శాఖలూ  అభివృద్ది చెందగలుగు తున్నాయి ."
" వాటన్నిటి తరుఫున మీకు అనంత ,శాశ్విత కృతజ్ఞ్యతలు ,వందనాలు :చిన్నప్పటినుండీ , ఈ భూమ్మీదకి వచ్చినప్పటి నుండీ మీతో ముచ్చటించాలని చచ్చే ఇది గా ఉండేది.ఆ బెంగ తీరింది.ఇంక ఉంటాం."
"నా అనంత,శాశ్విత ఆశీసులు మీ గణిత విద్యార్దులకీ ,ఉపాసకులకీ ఎల్లప్పుడూ ఉంటాయి.శుభం." 
















                                                    @@@

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి